ETV Bharat / state

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కలెక్టరేట్లు.. ఆర్కిటెక్​కు కేసీఆర్ ప్రశంసలు - ఆర్కిటెక్ ఉషారఘువీర్ రెడ్డి న్యూస్

Architect Usha Raghuveer Reddy : ఇరుకుగదులు, పెచ్చులూడే పైకప్పులు, వానొస్తే తడిసే దస్త్రాలు.. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు కలెక్టరేట్ల పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పాలనను ప్రజలచెంతకు తీసుకెళ్లడంపై తెరాససర్కారు దృష్టిసారించింది. అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆధునిక కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత భవన సముదాయాలను నిర్మించింది. ఆ కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలకు యాదాద్రి జిల్లాకి చెందిన.. ఆర్కిటెక్ ఉషారఘవీర్‌రెడ్డి రూపకల్పన చేశారు. అద్భుతమైన డిజైన్లు అందించడంతోపాటు సీఎం ప్రశంసలు అందుకున్నారు..

Architect Usha Raghuveer Reddy
Architect Usha Raghuveer Reddy
author img

By

Published : Feb 14, 2022, 12:12 PM IST

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కలెక్టరేట్లు

Architect Usha Raghuveer Reddy :ప్రత్యేక రాష్ట్రం సిద్ధించక ముందు ఏదైనా ఒక పనికోసం వెళ్లాలంటే ప్రజలకు వివిధ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అలా వెళ్లడం భారంగా మారడంతో అన్నిరకాల కార్యాలయాలు ఒకదగ్గర ఉంటే మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావించింది. తద్వారా పాలన ప్రజలకు చేరువ అవుతుందని గుర్తించింది. అందులోభాగంగా.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత కలెకరేట్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టేలా నిర్మాణాలు తలపెట్టింది. ఇప్పటికే కొన్నిచోట్ల సమీకృత కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా.. త్వరలోనే అన్ని జిల్లాలో ప్రారంభించేలా అడుగులు వేస్తోంది.

new collectorates in Telangana : ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో.. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా.. విశాలమైన విభిన్న ఆకృతులతో కొత్త కలెక్టరేట్‌ భవనాలు దర్శనమిస్తున్నాయి. సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాలపై ప్రత్యేక దృష్టిసారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వాటి నిర్మాణాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆకట్టుకునేలా, సౌకర్యంగా ఉండేలా నిర్మించాలని భావించారు. కలెక్టరేట్ల డిజైన్లు రూపొందించే అవకాశం.. యాదాద్రి జిల్లా మోటకొండురూ మండలం చాడ గ్రామానికి చెందిన.. ఆర్కిటెక్‌ ఉషారఘువీర్‌రెడ్డికి ఇచ్చారు. 1971లో అమెరికాలో ఆర్కిటెక్చర్‌ పూర్తిచేసిన ఆమె.. 1986లో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి వివిధ భవనాలకు ఆర్కిటెక్‌గా పనిచేశారు. అటవీశాఖ అధికారి చొరవతో.. ఉషారఘువీర్‌ డిజైన్‌ చేసిన భవనాలను పరిశీలించిన సీఎం.. కలెక్టరేట్ల బాధ్యతను ఆమెకు అప్పగించారు. కలెక్టరేట్‌ నిర్మాణాల ఆకృతులపై సీఎం సుదీర్ఘ అధ్యయనం చేశారని.. ఆ తర్వాతే తన ఆకృతులకు పచ్చజెండా ఊపారని ఉషారఘువీర్‌ తెలిపారు.

'నా పనిలో తెలంగాణతనం ఉట్టిపడేలా నేను జాగ్రత్త తీసుకుంటాను. ముఖ్యమంత్రి కేసీఆర్​.. నా పనిలో ఆ తెలంగాణతత్వాన్ని గుర్తించి ఈ బృహత్కార్యాన్ని నాకు అప్పగించారు. తెలంగాణ వైభవం ప్రతిబింబించేలా అన్ని కలెక్టరేట్ల భవనాలు రూపొందించాం. ప్రజల కోసం చేస్తున్న ఈ పనులు తక్కువ ఖర్చులో అవ్వాలని చూడకుండా.. నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ మరీమరీ చెప్పారు. వెంటిలేషన్ బాగా ఉండాలని కోరారు.'

- ఉషారఘువీర్ రెడ్డి, ఆర్కిటెక్

New Collectorates Designed By Usha Raghuveer : అన్ని కలెక్టరేట్లు తూర్పు, ఉత్తర దిక్కుకు ముఖద్వారాలు ఉండేలా.. విశాలమైన భవంతితో పాటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశామని.. ఉష వెల్లడించారు. నిర్వహణ సులభంగా ఉండేలా రూపొందించామని పేర్కొన్నారు. ఉషారఘువీర్‌ డిజైన్లను మెచ్చుకున్న సీఎం కేసీఆర్‌.. భువనగిరి కలెక్టరేట్‌ ప్రారంభించిన తర్వాత ఆ సమావేశంలో వేదికపైనే ఆమెను ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.