యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురగొముల సర్పంచ్‌గా ఆముదాల అపర్ణ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. నిధుల దుర్వినియోగం అభియోగాలతో... పాత సర్పంచ్ ఆముదాల సుమతి, ఉప సర్పంచ్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి జకీర్‌లను తొలగిస్తూ కలెక్టర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సర్పంచ్‌గా అపర్ణను కలెక్టర్ నామినేట్ చేయగా ఎంపీడీవో వాజీద్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. సంయుక్త చెక్‌పవర్ కోసం గ్రామానికి చెందిన రెండు వర్గాలు తీవ్రంగా పోటీపడ్డాయి. 9 మంది వార్డు సభ్యుల్లో ఐదుగురు శ్రీకాంత్‌కు మద్దతు తెలిపారు. మెజార్టీ సాధించిన శ్రీకాంత్‌కు సంయుక్త చెక్‌పవర్ కల్పిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇవీ చూడండి: కల్నల్ సంతోష్ బృందాన్ని ఉచ్చులో బిగించారా?