ETV Bharat / state

యాదాద్రీశుని సేవలో ఏపీ ఎమ్మెల్యే రోజా.. సీఎం కేసీఆర్​పై ప్రశంసల వర్షం - ts news

MLA Roja Visit Yadadri: ఏపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా యాదాద్రిని సందర్శించారు. యాదాద్రి ప్రాభవాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని ముఖ్యమంత్రి కేసీఆర్​పై ప్రశంసల వర్షం కురిపించారు. తిరుమలకు సమానంగా యాదాద్రిని సీఎం కేసీఆర్​ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.

యాదాద్రీశుని సేవలో ఏపీ ఎమ్మెల్యే రోజా.. సీఎం కేసీఆర్​పై ప్రశంసల వర్షం

author img

By

Published : Apr 1, 2022, 6:25 PM IST

MLA Roja Visit Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఏపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజూ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​పై ప్రశంసల వర్షం కురిపించారు. తిరుమలకు సమానంగా యాదాద్రిని సీఎం కేసీఆర్​ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. యాదాద్రి ప్రాభవాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవన్నారు. ఫిబ్రవరి 12న ఆలయం ప్రారంభం కాకముందు సందర్శించుకున్నానని తెలిపిన రోజా.. ప్రారంభించాక మళ్లీ రావాలని ముడుపు కట్టానని తెలిపారు. ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రెట్టింపు ఉత్సాహంతో సేవ చేస్తా.. స్వామి వారి నక్షత్రమైన స్వాతి నక్షత్రంలోనే తానూ పుట్టానని రోజా ఈ సందర్భంగా వెల్లడించారు. స్వామి వారి ఆశీర్వాదంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసేందుకు ముందడుగు వేస్తానన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. తాను గతంలో మాధవ రెడ్డితో కలిసి పనిచేశానని తెలిపిన రోజా.. ఆయన కుమారుడైన ఎలిమినేటి సందీప్​ రెడ్డితో కలిసి స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

తిరుమలకు సమానంగా యాదాద్రిని సీఎం కేసీఆర్​ అభివృద్ధి చేస్తున్నారు. యాదాద్రి ప్రాభవాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. ఫిబ్రవరి 12న ఆలయం ప్రారంభం కాకముందు సందర్శించుకున్నాను. ఆ రోజు ప్రారంభించాక మళ్లీ రావాలని ముడుపు కట్టాను. ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. -రోజా, ఏపీ ఎమ్మెల్యే

ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాన ఆలయంలోని స్వామివారి స్వయంభువులను, బంగారు కవచ మూర్తులను రోజా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, యాదాద్రి జెడ్పీ ఛైర్మన్​ ఎలిమినేటి సందీప్​ రెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.

యాదాద్రీశుని సేవలో ఏపీ ఎమ్మెల్యే రోజా

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.