రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. యాదాద్రి శ్రీలక్ష్మీనర సింహస్వామి దర్శనాలను మరో పది రోజుల వరకు నిలిపేశారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 19వ తేదీ వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించడంలేదని దేవస్థానం ఈవో గీత వెల్లడించారు.
దర్శనాలు, ఆర్జిత పూజలను నిలిపేస్తున్నట్లు తెలియజేశారు. లాక్ డౌన్ దృష్ట్యా ఆలయంలో ఇప్పటికే స్వామి వారికి, ప్రతి నిత్యం పూజలు ఏకాంతసేవలో ఆలయ సాంప్రదాయబద్ధంగా అర్చకులు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'