ETV Bharat / state

పాతగుట్ట బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పూర్ణాహుతి, చక్రస్నానం - yadadri district latest news

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి పూర్ణాహుతి నిర్వహించారు.

annual brahmotsavam in yadadri patha gutta temple in bhuvanagiri district
పాతగుట్ట బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పూర్ణాహుతి, చక్రస్నానం
author img

By

Published : Feb 27, 2021, 5:54 PM IST

యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న స్వస్తివాచనంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఆలయ కోనేరులో స్వామివారి చక్రస్నాన ఘట్టాన్ని కన్నుల పండువగా జరిపారు.

ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 28న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.

ఇదీ చూడండి: యాదాద్రి పాతగుట్టలో కన్నులపండువగా వార్షిక బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.