సిద్దిపేట ప్రాంతంలో కొందరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తూ, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా అదే ముఠా కారులో ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో సీసీ పూటేజీల ద్వారా కారు కదలికలను గుర్తించారు. కారు సిద్దిపేట నుంచి బచ్చన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్గంలో ప్రయాణించినట్లు, అక్కడి సీసీఎస్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు గుర్తించి సీసీ ఫుటేజీలను ఆలేరు ఎస్సైకి పంపించారు.
వెంటనే తన సిబ్బందితో రంగంలోకి దిగిన ఎస్సై రమేశ్ రాజపేటకి వెళ్లే ప్రధాన రహదారి మలుపు వద్ద కాపుకాసి కారును పట్టుకున్నారు. అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారు ఉన్నారు. కారును నడిపిన వ్యక్తి అప్పటికే పరారయ్యాడు. పట్టుబడిన కారులోని వ్యక్తులను, సిద్దిపేట సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. కారులో ఉన్నవారు దొంగ లేనా? పరారైన వ్యక్తి ఎవరై ఉంటారు? అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..