యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీ అదుపు తప్పి, ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : గోదారమ్మ ఉగ్రరూపం.. చిక్కుల్లో 19 గ్రామాలు