ETV Bharat / state

కొండపోచమ్మ రిజర్వాయర్​ నుంచి యాదాద్రి జిల్లాకు గోదావరి జలాలు - కొండపోచమ్మ రిజర్వాయర్​

కొండపోచమ్మ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగునీటిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు అందిస్తున్నందుకు కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

aleru mla gongidi sunitha mahender reddy released water from kondapochamma reservoir
కొండపోచమ్మ రిజర్వాయర్​ నుంచి యాదాద్రి జిల్లాకు గోదావరి జలాలు
author img

By

Published : Jun 24, 2020, 10:55 PM IST

కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాకు కాళేశ్వరం జలాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి విడుదల చేశారు. తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాలువ ద్వారా మాధపూర్, గోపాల్​పూర్, చిన్న లక్ష్మాపూర్​లోని ఐదు చెరువులకు, బొమ్మలరామారం మండలంలోని పలు చెరువులకు నీరు చేరనుంది. ఈ సందర్భంగా గోపాల్​పూర్ గ్రామ సర్పంచ్ పులాపల్లి జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా బోనాలతో కాలువ నుంచి గొలుసు కట్టు చెరువుల్లోకి వచ్చే గోదారమ్మకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంతోషం వ్యక్తం చేస్తూ కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. గోపాల్​పూర్ గ్రామస్థులందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఇవీ చూడండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.