జూనియర్ డాక్టర్లు నోటీసులు ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నేత బీర్ల ఐలయ్య అన్నారు. జూడాల సమస్యను, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందజేయాలని.. గతేడాది వీరికి ఇచ్చిన 10 శాతం ఇంప్రూమెంట్ అమలు కాలేదని తెలిపారు.
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వారి డిమాండ్లు నెరవేర్చడం ప్రభుత్వ కర్తవ్యమని ఐలయ్య అన్నారు. వారం రోజుల్లోగా రాష్ట్రానికి ఆరోగ్య మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.