రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు గృహనిర్బంధం చేయటంపై ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత బీర్ల అయిలయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఉద్యమం చేస్తాం..
ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం ఏమిటని బీర్ల అయిలయ్య ప్రశ్నించారు. ఎలాంటి వారెంట్ లేకుండా గృహనిర్బంధం చేయటం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అధిక కరెంట్ బిల్లులను వెంటనే తగ్గించాలని తెరాస సర్కారును డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.
అయిలయ్య డిమాండ్స్:
- లాక్డౌన్ కాలంలోని అద్దెలను మాఫీ చెయ్యాలి.
- స్లాబుల పేరుతో వసూలు చేస్తున్న అధిక విద్యుత్ బిల్లు నిలిపివెయ్యాలి.
- కరెంటు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
- మద్యం దుకాణాలు మూసివేయాలి.
ఇదీ చూడండి: 'మిడదల దండుపై దండయాత్రకు సిద్ధంకండి'