యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని మల్లికార్జున పత్తి పరిశ్రమలో ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొట్టమొదటి ఈ కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని.. రైతులు ఇక్కడ అమ్మితే నష్టపోకుండా మద్దతు ధర పొందుతారని ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!