యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ పర్యటించారు. మండలంలోని చౌక్ల తండా, పెద్ద తండా, రాంపూర్ తండా గ్రామాల్లోని పల్లె ప్రగతి పనులు, వైకుంఠదామాలు, నర్సరీలతో పాటు.. పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ షెడ్లను పరిశీలించారు.
వైకుంఠ దామం పనులు వారంలోపు పూర్తి చేయాలని.. నర్సరీలకు, పల్లె ప్రకృతి వనాలలోని మొక్కలకు వేసవిలో క్రమం తప్పకుండా నీరు అందించాలని ఆదేశించారు. నర్సరీకి షెడ్ నెట్ వేయించాలని.. మొలకెత్తని విత్తనాలు ఉన్న బ్యాగులలో మరలా విత్తనాలు నాటాలని సూచించారు.
ఇదీ చదవండి: బీజాపుర్‌లో ఎన్కౌంటర్- జవాను మృతి