యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామంలోని ఓ గోశాలలో గత కొంతకాలంగా గోవులు మృత్యువాత పడుతున్నాయి. మృతి చెందిన గోవులను గోశాల వెనక భాగంలోని గుంతలో పడేయడం వల్ల దుర్వాసనతో గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అయితే నిర్వహణా లోపం వల్లనే గోశాలలోని ఆవులు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి, గోశాల నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ