యాదాద్రి జిల్లా బీబీనగర్ సమీపంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మణప్రసాద్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరంలో మోత్కూరులోని ఏఈ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
గుండాల మండలం గంగాపురం గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ భూమిలో విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్న కరెంట్ కనెక్షన్ మంజూరు చేసేందుకు ఏఈ లక్ష్మణప్రసాద్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. విసిగిపోయిన రైతు రూ.6 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, అనిశా అధికారులకు సమాచారం ఇచ్చాడు. బీబీనగర్ సమీపంలోని ఓ హోటల్లో లంచం ఇస్తుండగా.. డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఏఈని అదుపులోకి తీసుకుంది.
ఇవీ చూడండి: యాదాద్రిలో వెలసిన అక్రమ వెంచర్ల తొలగింపు