ETV Bharat / state

Bike theft: చోరీకి గురైన బైక్​.. మరుసటి రోజే దొరికింది.! ఎలా అంటే.. - a person theft things only in need at mothkur

ఒక సినిమాలో ఓ దొంగ విచిత్రంగా దొంగతనాలు చేస్తుంటాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వాళ్ల బైక్ దొంగతనం చేస్తాడు. వాళ్లు గాబరా పడి పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చేలోపు ఆ బైక్ యథాస్థానంలో ఉంటుంది. అందులో మళ్లీ చిట్టీ కూడా రాసి ఉంటుంది. 'అవసరం ఉండి బండి దొంగిలించాను. మీ బైక్ వాడుకున్నందుకు ఇందులో సినిమా టికెట్లు పెడుతున్నాను. మీరంతా కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్తే సంతోషిస్తాను' అని రాసి పెడతాడు. దొంగ నిజాయతీకి ముచ్చటపడి సంతోషంతో సినిమాకు వెళ్తారు. వాళ్లు తిరిగి ఇంటికి వచ్చేలోపు ఉన్నదంతా దోచుకుపోతాడు. ఈ సినిమాలో దొంగ స్టోరీ చీటింగ్ అయితే ఇక్కడ దొంగ మాత్రం నిజంగా(Bike theft) నిజాయతీపరుడేనండోయ్.. ఎందుకంటారా ఇది చదవండి...

good thief in mothkur
మోత్కూరులో మంచి దొంగ
author img

By

Published : Sep 29, 2021, 12:47 PM IST

Updated : Sep 29, 2021, 2:19 PM IST

వాహనం పోయినా, వస్తువు పోయినా, ఇంట్లో దొంగతనం జరిగినా ఆ సొత్తు మళ్లీ మన చేతికి ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియదు. పోలీసులకు ఫిర్యాదు చేసి నెలల తరబడి వేచి ఉన్నా... పూర్తిస్థాయిలో సొమ్ము రికవరీ చేయడం చాలా అరుదు. మరి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఆ వస్తువును మరుసటి రోజు యథావిధిగా దొంగతనం చేసిన చోట పెట్టిపోతే ఎలా ఉంటుంది? వినడానికి విచిత్రమే. కానీ నిజంగా ఇది జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన దొంగతనం(Bike theft) ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చోరీకి గురైన బైక్​.. మరుసటి రోజే దొరికింది

జిల్లాలోని రామన్నపేట మండలం సూరారం గ్రామానికి చెందిన నర్సింహ.. మంగళవారం మోత్కూరుకు వచ్చారు. తనకు మనవడు పుట్టాడన్న సంతోషంలో తన మిత్రులతో కలిసి మద్యం దుకాణానికి వెళ్లారు. తన బైక్‌ను పోతాయిగడ్డలో ఉన్న వైన్స్ ముందు పెట్టి, మద్యం సేవించడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి బైక్‌(Bike theft) కనిపించలేదు. దీంతో నర్సింహ తన బైక్‌ ఎవరో దొంగలించారని స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు మళ్లీ మోత్కూర్‌కి వచ్చి అదే వైన్స్ ముందు చూసేసరికి తన వాహనం అక్కడే కనిపించింది.

good thief in mothkur
చోరీకి గురైన ద్విచక్ర వాహనం
good thief in mothkur
చోరీ చేసిన వ్యక్తి రాసిన చిట్టీ

బాబాయ్​ ఏమీ అనుకోవద్దు..

అదే ఆశ్చర్యం అనుకుంటే మళ్లీ బైక్‌(Bike theft)పై చిన్న చిట్టీ కూడా దర్శనమిచ్చింది. 'బాబాయ్ ఏమీ అనుకోవద్దు.. డబ్బులు అవసరం ఉండి, ఇంటికి వెళ్లి వచ్చాను. బైక్‌ను తీసుకెళ్లినందుకు ఏమీ అనుకోవద్దు' అంటూ అందులో రాసి ఉంది. బైక్​ దొరికిందన్న ఆనందం, చిట్టీని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైన నర్సింహ.. బైక్​ దొరికిందని పోలీసులకు తెలియజేశారు. దీంతో కథ సుఖాంతమైంది.

ఇదీ చదవండి: Posani vs Pawan issue: పోసానిపై జనసేన ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

Last Updated : Sep 29, 2021, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.