యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు భిక్షపతిగా గుర్తించారు. మృతుడు కారు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. రెడ్లరేపాక భిక్షపతి అత్తగారి ఊరని తెలుస్తోంది. అదే గ్రామంలో అతనికి 15 ఎకరాల పొలం ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అత్తగారి పొలంలోని పాతబడిన భవనంలో అనుమానాస్పదంగా ఉరి వేసుకొని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ఇవీచూడండి: రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనవడు మృతి