యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 80 శాతం పోలింగ్ నమోదైంది. 83 మంది ఓటర్లకు గానూ 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, తెరాస అభ్యర్థి చిన్నప్పరెడ్డి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల సరళిని పరిశీలించారు. వావిలాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు తన చిన్నబాబుతో ఓటు హక్కు వినియోగించుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
ఇదీ చూడండి : 5 నెలలైనా సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వరా..?