యాదాద్రి భువనగిరి జిల్లా నందనం గ్రామ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 6 గొర్రెలు మృతి చెందాయి. 10 గొర్రెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. నమాత్ పల్లికి చెందిన ఎల్లం జంగయ్య గొర్రెలు మేపుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గొర్రెలు చెల్లాచెదురుగా రహదారి పక్కన పడిపోయాయి. స్థానికులు గొర్రెల యజమానికి తగిన న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: దీపావళి కాంతుల్లో ఆసేతు హిమాచలం..