యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో గురువారం ఒక్క రోజే 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభనతో మండల వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు, మరిపడిగకు చెందిన మరో వ్యక్తికి వైరస్ సోకినట్లు ఫలితాల్లో స్పష్టం అయ్యింది.
అప్రమత్తంగా ఉండాలి...
బాధితుల్లో 6 నెలల పసివాడితో పాటు 4 ఏళ్ల బాలుడు ఉన్నట్లు మండల వైద్యాధికారి శ్రీనివాస్ ప్రకటించారు. అందరినీ హోమ్ క్వారంటైన్ తరలించినట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో, ఇంటి నుంచి బయలుదేరే ముందు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారి సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'ఒళ్లు దగ్గర పెట్టుకోండి'... రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరికలు