యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కస్తూరిభా కళాశాల అధ్యాపకురాలు, కవి మోత్కూరు సుజాతకు స్వర మయూరి 2020 పురస్కారం వరించింది. చిలుక పలుకులు నూతన వచన సాహిత్య ప్రక్రియ రూపకర్త చిలకమూరి తిరుపతి రూపొందించిన సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ నిర్మల్ ఆధ్వర్యంలో ఇటీవల 108 చిలుక పలుకులు సూజాతకు లభించింది.
చిలుకపలుకులు లభించినందుకు మోత్కూరి సుజాతకు ఈ సంవత్సరం స్వరమయూరి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఆన్లైన్ ద్వారా ప్రశంసాపత్రాన్ని పంపించారు. పురస్కారం వరించినందుకు తోటి ఉపాధ్యాయులు, కవులు ప్రజాభారత్ సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు అభినందించారు. సాహిత్య రంగంలో మరిన్ని ఆవిష్కరణల దిశగా కృషి చేస్తానని సుజాత వివరించారు.
ఇదీ చదవండిః నిధుల గోల్మాల్: మొరం పేరుతో పైసలు నొక్కేశారట!