YS Sharmila comments on Ponguleti : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభం కానుంది. హైకోర్టు, వరంగల్ సీపీ అనుమతులతో తిరిగి పాదయాత్ర కొనసాగనుంది. వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండాలో ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది.
YS Sharmila comments on Padayatra : మరోవైపు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్టీపీలో చేరతానని మాట ఇచ్చారని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో షర్మిల.. తన పాదయాత్రపై మాట్లాడారు. లా అండ్ ఆర్డర్‌ను అడ్డుపెట్టుకుని తన పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎక్కడ నా యాత్రను ఆపారే అక్కడి నుంచే మళ్లీ ప్రారంభిస్తున్నానని తెలిపారు.
'రూ.లక్ష రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదు. రైతుబంధు పేరుతో ఇతర రైతు పథకాలను నిలిపివేశారు. కేసీఆర్ ఒకరోజు నా పాదయాత్రలో పాల్గొనాలి. పాదయాత్రలో పాల్గొని సమస్యలు లేవని నిరూపించాలి. సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.' అని షర్మిల అన్నారు. కేసీఆర్ కోసం సిద్ధం చేశామని షూస్‌ను మీడియాకు చూపించారు.
Sharmila Padayatra resumes today: శంకరమ్మ తండా, లింగగిరి, సూరిపల్లి ఎక్స్ రోడ్, తోపనగడ్డ తండా, నెక్కొండ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర 5.30 గంటలకు నెక్కొండకు చేరుకుంటుంది. అక్కడ మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించిన అనంతరం నెక్కొండలోనే షర్మిల బస చేయనున్నారు. పదయాత్ర పునప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. రైతులను కేసీఆర్ అడుగడుగునా మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఇవీ చదవండి: