ETV Bharat / state

'అధికారులే ఆత్మబంధువులు... అనాథ అమ్మాయికి పెళ్లి'

అమ్మ నాన్న లేని ఓ అనాథ అమ్మాయికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగమే బంధువులయ్యారు. ప్రభుత్వ స్వధార్​ హోమ్​లో పెరిగిన ఈ అమ్మాయికి అధికారులే అత్మబంధువులుగా మారి.. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. తనకు ఎవరూ లేరు అనే ఆలోచన రాకుండా... నీ కోసం మేమంతా ఉన్నామంటూ తన వెంట నిలిచి ఆ అమ్మాయి ముఖంలో సంతోషం నింపారు.

'అధికారులే ఆత్మబంధువులు... అనాథ అమ్మాయికి పెళ్లి'
author img

By

Published : Jun 16, 2019, 7:59 PM IST

వరంగల్​ పట్టణం హన్మకొండలో జిల్లా ప్రభుత్వ అధికారులు పెళ్లి పెద్దలుగా మారి తల్లిదండ్రులు లేని ఓ అమ్మాయికి వివాహం జరిపించారు. మహబూబ్​నగర్​కు చెందిన మహాలక్ష్మికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయి వీధి బాలికగా జీవనం కొనసాగిస్తుండేది. 8 ఏళ్లక్రితం ఆ అమ్మాయి వరంగల్​కు చేరింది.

'అధికారులే ఆత్మబంధువులు... అనాథ అమ్మాయికి పెళ్లి'

సర్వీస్​ హోమ్​లో ఆశ్రయం:

ఆ అమ్మాయిని మహిళా శిశు సంక్షేమ శాఖ వారు చేరదీసి హన్మకొండలోని సర్వీస్​ హోమ్​లో ఆశ్రయం కల్పించారు. మహాలక్ష్మికి ఓపెన్​టెన్త్​లో పరీక్ష రాయించి టైలరింగ్​లో శిక్షణనిచ్చారు. ప్రస్తుతం ఆమె వయస్సు 24 సంవత్సరాలు కాగా... ఒక మంచి జీవితాన్ని అందించాలనే ఆలోచనతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు మహాలక్ష్మికి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ముందుకు వచ్చిన ఆదర్శ యువకుడు:

వరంగల్​ అర్బన్​ జిల్లా పైడిపల్లి గ్రామానికి చెందిన సుంకరి యాకయ్య ఆమె గురించి వివరాలు తెలుసుకుని... మహాలక్ష్మిని వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. యాకయ్య వయస్సు30 సంవత్సరాలు. కొంతకాలం క్రితం అతడి తండ్రి మరణించగా... ప్రస్తుతం అతనికి తల్లి, ఇద్దరు అక్కలున్నారు. అక్కలిద్దరికి పెళ్లి అయింది. అతని కుటుంబ సభ్యులు నిండు మనసుతో ఈ వివాహానికి ఒప్పుకున్నారు. నగరానికి చెందిన వర్తక సంఘం, రైస్​ మిల్లర్స్​, ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​, లయన్స్​ క్లబ్​ ఆఫ్​ వరంగల్​ జిల్లా అధికారుల సహకారంతో ఇవాళ మహాలక్ష్మి, యాకయ్యల పెళ్లి ఘనంగా జరిగింది. వీరి వివాహానికి జిల్లా ప్రభుత్వ అధికారులతో పాటుగా వరంగల్​ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమల దేవి ముఖ్యఅతిథిగా హాజరై ఆశీర్వదించారు.

వాళ్లు యువతకు స్ఫూర్తి:

మాటలు అందరూ చెబుతారు కానీ... వాటిని ఆచరణలో కొందరు మాత్రమే పెడతారని... ఈ ఆదర్శ వివాహానికి ముందుకు వచ్చిన యాకయ్యను అందరూ అభినందించారు. వీరిని చూసి సమాజంలో మిగిలిన యువత కూడా స్పూర్తి పొందాలని పెద్దలు ఆకాంక్షించారు.

ఇదీచూడండి: బిడ్డను అమ్మకానికి పెట్టిన కన్నతల్లి

Intro:TG_WGL_11_16_ANAADHA_PELLIKI_ADHIKARULE_BANDHUVULU_PKG_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) అమ్మ నాన్న లేని ఒక అనాధ అమ్మాయికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగమే బంధువులు అయ్యారు. ప్రభుత్వ స్వధార్ హోమ్ లో పెరిగిన ఆ అమ్మాయికి ఆ శాఖ అధికారులే అమ్మానాన్నలుగా మారి... అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. తనకు ఎవరూ లేరు అనే ఆలోచన ఆ అమ్మాయికి రాకుండా ....నీ కోసం మేమంతా ఉన్నాం అంటూ తన వెంట నిలిచి.. ఆ అమ్మాయి ముఖంలో ఆనందాన్ని నింపారు. LOOK

V.O : జిల్లా ప్రభుత్వ అధికారులు పెళ్లి పెద్దలు గా మారి తల్లిదండ్రులు లేని అమ్మాయికి వివాహం జరిపించిన మహాఘట్టం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహాలక్ష్మి అనే అమ్మాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి వీధి బాలికగా జీవనం కొనసాగిస్తూ 8 సంవత్సరాల క్రితం వరంగల్ కు చేరింది. ఆ అమ్మాయిని మహిళ శిశు సంక్షేమ శాఖ వారు చేరదీసి హన్మకొండలోని సర్వీస్ హోమ్ లో ఆశ్రయం కల్పించారు. ఆ అమ్మాయిని ఓపెన్ టెన్త్ లో పరీక్ష రాయించి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం హన్మకొండలోని స్వధార్ హోమ్ లో ఉంటున్న మహాలక్ష్మి వయసు 24 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఒక మంచి జీవితాన్ని అందించాలనే ఆలోచనతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు మహాలక్ష్మికి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరి ద్వారా వివరాలు తెలుసుకున్న వరంగల్ అర్బన్ జిల్లా పైడిపల్లి గ్రామానికి చెందిన సుంకరి యాకయ్య మహాలక్ష్మిని వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. యాకయ్య వయస్సు 30 సంవత్సరాలు. కొంతకాలం క్రితం అతడి తండ్రి మరణించగా... ప్రస్తుతం అతనికి తల్లి వివాహం జరిగిన ఇద్దరు అక్కలు ఉన్నారు. అతని కుటుంబ సభ్యులు కూడా నిండు మనసుతో ఈ వివాహానికి ఒప్పుకున్నారు. నగరానికి చెందిన వర్తక సంఘం, రైస్ మిల్లర్స్, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ మరియు జిల్లా అధికారుల సహకారంతో ఈరోజు మహాలక్ష్మి యాకయ్య ల వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి జిల్లా ప్రభుత్వ అధికారులతో పాటుగా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమల దేవిగారు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమల దేవిగారు వధూవరులను ఆశీర్వదించి .... జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ తరపున ఈ దంపతులను పారా లీగల్ వాలంటీర్స్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మాకు ఎవరు లేరు అని అనుకునే కన్నా మనం ఇంకొకరికి తోడుగా నిలుద్దాం అనే విధంగా అందరూ ఆలోచించాలని ఆమె తెలిపారు.

bytes.....

తిరుమలా దేవి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి.

సబిత, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి.

END : మాటలు అందరూ చెబుతారు కానీ వాటిని ఆచరణలో కొందరు మాత్రమే పెడతారని... ఈ ఆదర్శ వివాహానికి ముందుకు వచ్చిన యాకయ్య ను అందరూ అభినందిస్తున్నారు. వీరి భావి జీవితం సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలని పెళ్లి పెద్దలు వీరిని ఆశీర్వదించారు. వీరిని చూసి సమాజంలో మిగిలిన యువత కూడా స్పూర్తి పొందాలని పెద్దలు ఆశిస్తున్నారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.