వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు నూతనంగా భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీపీ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, భరోసా కేంద్రాల రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ మమత ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ తర్వాత తొలిసారిగా హన్మకొండలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు.
పూర్తిగా మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రం... అత్యాచారం, ఫోక్సో కేసులకు సంబంధించిన వాటిలో మహిళలు, చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని నింపి, వారికి ధైర్యాన్ని కలిగించే విధంగా పని చేస్తాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసుల్లో ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తికి తమ వాంగ్మూలాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఇదీ చూడండి: 'తబ్లీగీలను నిషేధించడంపై కేంద్రం వైఖరేంటి?