ETV Bharat / state

మహిళా దొంగ అరెస్ట్​.. 974 గ్రాముల బంగారం స్వాధీనం - warangal cp ravinder latest news

మహిళల ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర మహిళ దొంగను జనగామ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితురాలి నుంచి రూ.44 లక్షల విలువ చేసే 974 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Woman Thief Arrested in janagama
మహిళా దొంగ అరెస్ట్​.. 974 గ్రాముల బంగారం స్వాధీనం
author img

By

Published : Mar 10, 2020, 9:12 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి మండలం వైకుంఠపురానికి చెందిన పద్మ తన భర్త చనిపోవడం వల్ల కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేది. ఆదాయం సరిపోకపోవడం వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగగా మారింది. ఆలోచనతో బస్టాండు, రద్దీ ప్రాంతాల్లో మహిళల బ్యాగులు, పర్సులోని బంగారు అభరణాలను చోరీ చేయడం ప్రారంభించింది.

గతంలో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చి.. మళ్లీ చోరీలు ప్రారంభించినట్లు వరంగల్​ సీపీ రవీందర్​ తెలిపారు. వరంగల్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో 17 చోరీలకు పాల్పడిందని సీపీ వెల్లడించారు. గత నెల 25న జనగామ బస్టాండులో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కిందని తెలిపారు. దృశ్యాల ఆధారంగా నిందితురాలిని పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు.

ఈ రోజు చోరీ చేసిన సొమ్ముతో జనగామకు రాగా ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితురాలి నుంచి నుంచి రూ.44 లక్షల విలువ చేసే 974 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మహిళా దొంగ అరెస్ట్​.. 974 గ్రాముల బంగారం స్వాధీనం

ఇదీ చదవండి:'అల్లుడు గారూ... గాడిదపై ఎక్కండి మర్యాదలు చేస్తాం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.