పింఛనుదారుల దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్భన్ జిల్లా కాజీపేటలో రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వినయ్ భాస్కర్ తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రైల్వే బోర్డుతో చర్చిస్తామని వారికి హామీ ఇచ్చారు.
వరంగల్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కడియం అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ను అన్ని విధాల వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ఇవీచూడండి: 'పెన్షనర్ల సమస్యల పట్ల సీఎంతో చర్చిస్తా'