వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని ప్రాదేశిక ఎన్నికలు ఉదయం నుంచి ప్రశాంతంగా సాగుతున్నాయి. ఎండ, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ కాస్తా మందగించింది. భీమదేవరపల్లి మండలంలోని 13 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి 72 పోలింగ్ కేంద్రాలు, ఎల్కతుర్తి మండలంలో 12 ఎంపీటీసీ , ఒక జడ్పీటీసీ స్థానానికి 65 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు వీల్ఛైర్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొన్ని కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు.
వడగాలుల తీవ్రతతో కాస్త మందగించిన పోలింగ్ - mptc
వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.