వరంగల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఆఖరి రోజు కావడం వల్ల ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఎక్సైజ్ కార్యాలయం ముందు బారులు తీరారు. పలువురు మహిళలు కూడా ఉత్సాహంగా వచ్చి దుకాణాల కోసం దరఖాస్తు చేశారు. గడువు సమయం ముగుస్తున్నందున త్వరగా డీడీలు కట్టి.. అక్కడే దరఖాస్తులను పూర్తి చేసి.. ఎక్సైజ్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5, 222 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి దుకాణాలు కేటాయిస్తామని అధికారులు చెప్పారు.
ఇవీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..