ETV Bharat / state

ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలా మారుస్తాం - ఎంజీఎం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సూపర్​ స్పెషాలిటీలా మారుస్తామని హామీ ఇచ్చారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలా మారుస్తాం
author img

By

Published : Jul 31, 2019, 11:10 AM IST

వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రికి మూడు నెలల్లో కొత్త రూపు తీసుకువస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తక్షణ కార్యాచరణ కింద రూ. 5 కోట్లతో అత్యవసర పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఎంజీఎం అభివృద్ధిపై హన్మకొండ కలెక్టరేట్​లో కలెక్టర్, ఎంజీఎం వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాల సేవలను పునరుద్ధరించి.. ఎంజీఎం ఆవరణ మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చేస్తామని ఆయన తెలిపారు. మరుగుదొడ్లు, మూత్రశాలల మరమ్మతు పనులను వెంటనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పేదల ఆసుపత్రి ఎంజీఎంను కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపు తెచ్చారని అన్నారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎంను పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలా మారుస్తాం

ఇదీ చూడండి: మాస్టర్ ప్లాన్​ సమర్పించండి: హైకోర్టు ఆదేశం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.