వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ వైష్ణవి గ్రాండ్స్లో ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో నిర్వహించిన వివాహ పరిచయవేదికకు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతీ యువకులు, తల్లిదండ్రులతో పరిచయ వేదిక సందడిగా మారింది. వధువరులను ఎంపిక చేసుకోవడానికి ఈ పరిచయ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈనాడు యాజమాన్యానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి :'చట్ట సభల్లో 50 శాతం బీసీలుండాలి'