ETV Bharat / state

'సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో..' - వరంగల్​ పట్టణ జిల్లా తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని... ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. హన్మకొండలోని బాలసముద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

trs government moved forward with development and welfare schemes
'కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు'
author img

By

Published : Jan 20, 2021, 5:44 PM IST

తెరాస ప్రభుత్వం ఒక వైపు అభివృద్ధి.. మరో వైపు సంక్షేమ పథకాలతో ముందుకుపోతోందని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. పట్టణ ప్రజా సంక్షేమ యాత్రలో భాగంగా హన్మకొండలోని బాలసముద్రంలో.. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్​తో కలిసి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల్లో కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లను వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి: మొరం గడ్డలు.. ఒకొక్కటి నాలుగు కిలోల పైమాటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.