ETV Bharat / state

'సడలింపులు వచ్చినా సరే... నిబంధనలు పాటించండి'

లాక్​డౌన్ ఆంక్షల సడలింపులతో రోడ్లపైకి వచ్చే వారి రద్దీ క్రమంగా పెరుగుతోంది. వరంగల్​ అర్బన్​ జిల్లాలో కూడా ఏసీ, ఆటోమొబైల్​ దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. జిల్లాలోని కరోనా బాధితులు సైతం కోలుకోవడం మంచి పరిణామంగా అధికారులు పేర్కొంటున్నారు. మరిన్ని రోజులు లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని.. లేకుంటే ప్రమాదం తప్పదని సూచిస్తున్నారు.

warangal-urban-district-in-lock-down
'సడలింపులు వచ్చినా సరే... నిబంధనలు పాటించండి'
author img

By

Published : May 16, 2020, 5:37 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో 50రోజుల తరువాత ఏసీ, ఆటోమోబైల్ దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్​డౌన్​ ఆంక్షల సడలింపులతో రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. సడలించిన వాటిలో భాగంగా ఎలక్ట్రికల్, గృహ నిర్మాణ సంబంధమైన దుకాణాలూ గత వారంలో తెరుచుకున్నాయి. ఈ దుకాణాలకు వచ్చేవారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించి దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మంత్రి సమీక్ష..

వలస కూలీలను స్వస్థలాలకు పంపించేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ 19 నియంత్రణా చర్యలు... ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై హన్మకొండలో ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇది శుభపరిణామం..

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటివ్ వ్యక్తులంతా కోలుకుని... ఆసుపత్రి నుంచి డిశ్చార్చి కావడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. కేసుల సంఖ్య తగ్గినా... ప్రమాదం ఇంకా పొంచే ఉందని... అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్​డౌన్ పరిస్థితుల్లోనూ రైతులకు మద్దతు ధర చెల్లించి...ధాన్యం, మక్కలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

వాళ్లకి సహకరించండి..

వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు ప్రత్యేక రైళ్లు, ఇతర వాహనాల ద్వారా వచ్చిన 916 మందిని వైద్య శాఖ అధికారులు హౌం క్వారంటైన్ చేశారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. జనగామలో రెండో రోజూ పలు గ్రామాల్లో రక్తపరీక్షలను ఐసీఎంఆర్ సిబ్బంది నిర్వహించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవాపూర్, పాలకుర్తి మండలం మంచుప్పుల, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి, రఘనాథపల్లి మండలం కంచనపల్లి తదితర గ్రామాల్లో మొత్తం 5 బృందాలుగా పర్యటించి... ప్రజల నుంచి నమూనాలు సేకరించారు.

మీ సహకారమే మాకు కావాలి...

కరోనా వైరస్‌ తీవ్రత, లక్షణాలు కనిపించకున్నా... వైరస్ వ్యాప్తి... రోగనిరోధక శక్తి వృద్ధి తదితర అంశాలు తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 60 జిల్లాల్లో భారతీయ వైద్య పరిశోధనా మండలి ఈ సర్వే నిర్వహిస్తోంది. సడలింపులు ఇచ్చినా సరే... ప్రజలందరూ లాక్​డౌన్ నియమాలు పాటిస్తే... కరోనా రహిత వరంగల్​ అర్బన్​ను చూడవచ్చని అధికారులు తెలుపుతున్నారు. వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రజల సహకారం తప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.