రాష్ట్రంలో కరోనా పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారుతోంది. రోజుకి వేయ్యికి పైగా కేసులు నమోదవుతుండం వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సామాన్య జనాలతో పాటు అధికారులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కలెక్టర్ కుటుంబ సభ్యులకు, ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఫలితాలు రావాల్సి ఉంది. గురువారం జిల్లాలో మొత్తం 75 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?