విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ.. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించి బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధం పర్ధంలేని కరెంట్ బిల్లులతో... ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుల నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకు చేస్తున్నవారని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: ఖరీదైన కారు వాడుతున్న భారత క్రికెటర్ ఎవరంటే..?