ETV Bharat / state

'ఉపకార వేతనాల పెండింగ్​ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి' - social welfare

వరంగల్​ పట్టణ జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలపై అధికారులతో జిల్లా కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్​ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

warangal urban collector review on pending scholarships in district
'ఉపకార వేతనాల పెండింగ్​ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'
author img

By

Published : Aug 14, 2020, 10:41 PM IST

జిల్లాలోని వివిధ డిగ్రీ, జూనియర్​ కళాశాలల్లో చదివే ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్​ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టర్ ఛాంబర్​లో విద్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో పెండింగ్ ఉపకార వేతనాలపై సమీక్షించారు. ఆయా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను తొందరగా పంపించేందుకు డిగ్రీ కళాశాలల్లో ఆర్​జేడీలు, జూనియర్ కళాశాలల్లో డీఐవోలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెండింగ్ దరఖాస్తులను వెంటనే షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ అధికారులకు పంపించాలని పేర్కొన్నారు. జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలల నుంచి మొత్తం 15,164 దరఖాస్తులు రాగా... అందులో 1912 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని అన్నారు. విద్యార్థులు మీ సేవకు వెళ్లి పెండింగ్​లో ఉన్న దరఖాస్తులు క్లియర్ చేసుకోవాలన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.