ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా అందజేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. హన్మకొండలోని కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
![collector rajiv gandhi hanumanthu, warangal urban news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-03-07-collecter-on-voter-jabitha-av-ts10077_07042021213426_0704f_1617811466_151.jpg)
ఓటర్ల ముసాయిదా జాబితాపై గల్లంతు, మార్పులు చేర్పులు వంటి ఎలాంటి అభ్యంతరాలున్నా.. లిఖిత పూర్వకంగా అందజేయాలని వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈనెల 12న తుది జాబితా ప్రచురిస్తామని కలెక్టర్ తెలిపారు.
- ఇదీ చదవండి : గాంధీలో మరో 200 ఆక్సిజన్ పడకలు