సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా 14 రోజుల వరకూ హోం క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 102 మంది వచ్చినట్లు గుర్తించామని, వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్వారంటైన్‌కి పంపినట్లు వివరించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి