ETV Bharat / state

'నగరంలో ఉగాది నుంచి ఇంటింటికి తాగునీరు'

వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.. కలెక్టరేట్​లో అధికారులతో సమావేశమయ్యారు. న‌గ‌రంలో ఉగాది నుంచి.. ప్రతి ఇంటికి స్వ‌చ్ఛ‌మైన మిష‌న్ భ‌గీర‌థ నీటిని అందించడానికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

warangal urban collector conducted a meeting on drinking water facility in city
'నగరంలో ఉగాది నుంచి ఇంటింటికి తాగునీరు'
author img

By

Published : Mar 24, 2021, 12:26 PM IST

నగరంలో ఉగాది పండుగ నుంచి ఇంటింటికి మిష‌న్ భ‌గీర‌థ తాగునీటిని అందించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో.. బల్దియా, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ ఇంజినీర్లతో ఆయన సమావేశం జరిపారు.

మహానగర పాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద.. పైపు లైన్లు, నల్లా కనెక్షన్లు, ఫిల్టర్ బెడ్ల నవీకరణ, స్మార్ట్ సిటీ పనుల పురోగతిని కలెక్టర్​ సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. లీకేజీలు ఉన్న పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయాలని సూచించారు.

ఇదీ చదవండి: పది, ఇంటర్‌ పరీక్షలు ఉంటాయా..? విద్యార్థులు,తల్లిదండ్రుల్లో ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.