ETV Bharat / state

ఊపందుకున్న వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు.. అనుకున్న సమయానికే..!

వరంగల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు.. వేగం పుంజుకున్నాయి. 3 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తూ.. ఆసుపత్రి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. 24 అంతస్తుల వరకూ సామగ్రిని తీసుకెళ్లేందుకు.. బాహుబలి క్రేన్లను వినియోగిస్తున్నారు.

author img

By

Published : Jun 23, 2022, 4:51 PM IST

ఊపందుకున్న వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు.. అనుకున్న సమయానికే..!
ఊపందుకున్న వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు.. అనుకున్న సమయానికే..!
ఊపందుకున్న వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు.. అనుకున్న సమయానికే..!

చారిత్రక నగరిగా ఖ్యాతి పొందిన వరంగల్​లో అధునాతనమైన వైద్య సేవల కోసం నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆసుపత్రి రోగులకు సరిపోకపోవడంతో.. కేంద్ర కారాగారాన్ని తొలగించి.. ఆ ప్రాంతంలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందుతూ.. వరంగల్ నగరం ఓ హెల్త్ సిటీగా నిలవాలన్న ఆకాంక్షతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో.. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సంకల్పించారు. సరిగ్గా గతేడాది జూన్​లో ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. 24 అంతస్తులతో.. అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ ఆసుపత్రి నిర్మాణం.. ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. ప్రారంభంలో పనులు నెమ్మదించినా.. గత రెండు నెలల నుంచి మళ్లీ పనులు జోరందుకున్నాయి.

34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు..: రహదారులు, భవనాల సంస్థ ఆసుపత్రి పనులను పర్యవేక్షిస్తోంది. సెయిల్ నుంచి ఉక్కును, గోదావరి నుంచి ఇసుకను తీసుకొచ్చి.. నిర్మాణం సాగిస్తున్నారు. ఆర్ అండ్ బీతో పాటుగా.. నిత్యం 30 మంది ఇంజినీర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు. 59 ఎకరాల్లో సువిశాలంగా నిర్మిస్తున్న ఆ ఆసుపత్రిలో గుండె ఇతర అవయావాల మార్పిడి, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు రోగులకు అందనున్నాయి. వైద్యుల కోసం ప్రత్యేకంగా గదులు, వైద్య విద్యార్థుల కోసం సెమినార్ హాళ్లు.. పచ్చదనం పెంచేలా ఆసుపత్రి ముందు అందమైన ఉద్యానవనం, విశాలమైన పార్కింగ్ ఇలా అనేక ప్రత్యేకతలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సర్వాంగ సుందరంగా నిర్మితం కానుంది.

ఏడాదిన్నరకల్లా నిర్మాణం పూర్తి..: నిట్ ఇంజినీర్లు ఇప్పటికే మట్టి పరీక్షలు నిర్వహించి.. తమ ఆమోదం తెలిపారు. ఏడాదిన్నరకల్లా ఆసుపత్రి నిర్మాణం పూర్తై.. అధునాతన వైద్య సేవలు.. ప్రజలకు అందుబాటులోకి వస్తాయని.. గత నెలలో వరంగల్ పర్యటకు వచ్చిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు చెప్పారు.

అనుకున్న సమయానికే.. వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలగకుండా ఉంటే.. అనుకున్న సమయంలోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద దవాఖానాగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పేరొందనుంది.

ఇవీ చూడండి..

'ఇది కథ కాదు..' ఓరుగల్లు బిడ్డ కన్నీటి గాథ

పన్నీర్​సెల్వంకు ఘోర పరాభవం.. సీసాలతో దాడి.. సభ నుంచి వాకౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.