కాజీపేటలో రైల్వేకోచ్ కర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందించారు.
కాజీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అన్న నేతలు.. అందుకు అవసరమైన భూమిని సిద్ధం చేశామన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం మంజూరుచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆ ప్రాంతానికి జాతీయస్థాయిలో ప్రాధాన్యత ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికీ మంచిపేరు వస్తుందని నేతలు అన్నారు.
ఇవీచూడండి: పుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల ఏర్పాటుకు నాబార్డుకు కేటీఆర్ ప్రతిపాదన