ETV Bharat / state

'సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న విధంగా చిత్రీకరించాడా?' - Warangal police investigating Saif

Police are interrogating Saif: వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు సైఫ్​ను వివిధ కోణాల్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.

Saif
Saif
author img

By

Published : Mar 4, 2023, 12:37 PM IST

Police are interrogating Saif: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్​ను మూడో రోజు పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులపాటు.. నిందితుడిని కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ నేతృత్వంలో సైఫ్​ను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక కొత్త విషయాలను సైఫ్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది.

ప్రీతిపై సైఫ్ కక్ష పెంచుకోవడానికి గల కారణాలు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు ప్రీతి పోస్టుమార్టం రిపోర్ట్​ను వైద్యులు పోలీసులకు అందజేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న విధంగా చిత్రీకరించాడా అనే కోణంలోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్​ స్వయంగా విచారించినట్లు తెలుస్తోంది. నిందితుడిపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. మరోవైపు సైఫ్ వేధింపులకు పాల్పడ్డాడని యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు, పోలీసులు నిర్థారించారు.

హెచ్​వోడీపై బదిలీ వేటు: మరోవైపు వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సైఫ్.. మానసిక వేధింపులు నిజమేనని ర్యాంగింగ్ నిరోధక కమిటీ స్పష్టం చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ ఆదేశాల మేరకు బుధవారం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఇందులో ఆస్పుత్రిలో ప్రీవెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన ఒక వివాదం ఒక్కటే వీరి మధ్య వివాదానికి కారణ కాదని వివరించింది. అంతే కాకుండా వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్థీషియా వైద్య విభాగం హెచ్​వోడీ నాగార్జునరెడ్డి కూడా సైఫ్​ది తప్పేనని అంగీకరించారు. దీని ఆధారంగా అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డిని బదిలీ చేసింది. దీంతో నాగార్జునరెడ్డిని భూపాలపల్లి వైద్య కళాశాల ప్రొఫెసర్​గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

రిమాండ్ రిపోర్ట్‌లోనూ కీలక అంశాలు: ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లోనూ కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్‌ ఫోన్‌లో పలు వాట్సాప్ చాట్స్‌‌ను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలోనే 19 మంది సాక్షులను విచారించారు. మరోవైపు ఘటన జరిగినా ప్రీతి గదిలో ఇంజెక్షన్లతో సహా మొత్తం 24 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ప్రీతి ఆత్మహత్యపై ఆమె తండ్రి ధరావత్ నరేందర్ స్పందించారు. తన కూతురిది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికి హత్యేనని స్పష్టం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: పోలీసుల కస్టడీలో సైఫ్​.. హెచ్​వోడీ నాగార్జునరెడ్డిపై వేటు

రిజర్వేషన్‌ బాపతు ఇలాగే ఉంటారు ప్రీతిని అవమానించిన సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

హైదరాబాద్ ఘటనతో మేల్కొన్న మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ.. కుక్కలకు ఆపరేషన్లు

ఫామ్​హౌస్​లో కుమారస్వామి చండికా హోమం.. 300 మంది పూజారులను పంపిన కేసీఆర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.