వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పాల్గొని మొక్కలను నాటారు. వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలను నాటాలని సూచించారు. వరంగల్ నగరంను పచ్చగా మారుస్తానని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: సాక్షిని వేధించిన ఖాకీలు..యువకుడి ఆత్మహత్య