వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు మేయర్ గుండా ప్రకాశ్ రావు. సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు శాలువాలు కప్పి సత్కరించారు. కరోనా సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సేవలందించారని తెలిపారు.
పట్టణంలోని 58 డివిజన్లలో పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తించారని అన్నారు. ఏప్రిల్ 24 నుంచి నేటి వరకు జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడానికి, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులే కారణమని తెలిపారు. పట్టణంలో కొన్ని సంస్థలు మినహా అన్ని వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి