వరంగల్‌కు చెందిన అఖిల్ అనే న్యాయవిద్యార్థికి అమెరికాలోని బిల్‌క్లింటన్ ఫౌండేషన్ నుంచి ఆహ్వానం లభించింది. తెలంగాణలో ఆదివాసులకు న్యాయ సలహాలు-చట్టాలపై అవగాహన కల్పించడం కోసం వరంగల్ కేంద్రంగా క్రియాశీలక హక్కు సంస్థను అఖిల్ స్థాపించాడు.
ఈ కేంద్రానికి ఆర్థిక సాయం అందించేందుకు క్లింటన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న అఖిల్ అమెరికాలోని ఫౌండేషన్‌కు రావాలని ఆహ్వాన పత్రాన్ని పంపించారు.
ఇదీ చూడండి : మనుషులకే కాదు.. చేపలకూ శ్మశానవాటికలు..!