ETV Bharat / state

Warangal Floods 2023 : ఇంకా గాడిన పడని వరంగల్‌.. ఇళ్లను శుభ్రం చేసుకోవడంలోనే గడిచిపోతున్న రోజులు - ఈరోజు తెలంగాణ వార్తలు

Flood Victims Problems in Warangal : వరదల బారినపడ్డ వరంగల్ ఇంకా పూర్తిగా గాడిన పడలేదు. తడిసిన బియ్యం పారేయడం, ఇళ్లూ వాకిళ్లు శుభ్రం చేసుకోవడంలో నగరవాసులంతా నిమగ్నమయ్యారు. కొందరి ధ్రువపత్రాలు కొట్టుకుపోగా.. తడిసి పోయిన వాటిని ఆరబెట్టుకుంటున్నారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ధీనంగా వేడుకుంటున్నారు.

Warangal Floods 2023
Warangal Floods 2023
author img

By

Published : Jul 31, 2023, 11:22 AM IST

వరద నుంచి ఇంకా గాడిన పడని వరంగల్‌.. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు

Floods Effect in Warangal : వరంగల్ నగరంలో వర్షాలకు జల దిగ్భందనమైన కాలనీలన్నీ దాదాపుగా బయటపడ్డాయి. ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత్ నగర్ 2 కాలనీల్లో ఇంకా అక్కడక్కడ వరద నీరు నిలిచే ఉంది. వర్షాలు, వరదలకు.. తడసిన దుస్తులను ఆరేసుకోవడం, బురదమయమైన ఇళ్లను శుభ్రం చేసుకోవడంలోనే నగరవాసులకు రోజులు గడిచిపోతున్నాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లోవారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తడిసిపోయిన విద్యార్థుల ధ్రువపత్రాలు, ఇంటి పత్రాలు ఇతర ముఖ్యమైన పత్రాలు కొందరివి పోగా.. మరికొందరు తడిసిన వాటిని ఆరబెట్టుకుంటున్నారు.

Warangal Flood Victims Problems : రోజు కూలీ పనులు, ఇతరత్రా చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునే కుటుంబాలపై వరదలు కోలుకోలేని దెబ్బ తీశాయి. వర్షాల కారణంగా కూలి కెళ్లక ఓవైపు నష్టపోతే.. వరదల కారణంగా ఇంట్లో సరుకులు, సామగ్రి కొట్టుకుపోయి మరింత నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయక విగ్రహాల తయారీదారులను భారీ వర్షాలు, వరదలు ఆరంభంలోనే నష్టాల పాలయ్యేలా చేశాయి. మట్టి, రంగులు, గడ్డి కొట్టుకుపోయి నష్టాలపాలైయ్యామని.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వం కోల్పోయిన తమను.. ప్రభుత్వం ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.

"మాకు ఏ రోజు కూడా నీళ్లు ఇంట్లోకి రాలేదు. నాలాలు కరెక్టుగా చూసుకుంటే ఇళ్లల్లోకి నీళ్లు రాకుండా ఉండేవి. ఇళ్లల్లోకి నీరు రావడంతో ఉన్న సమాన్లు మొత్తం తడిసిపోయాయి. నా సర్టిఫికెట్స్​ని భద్రం చేసుకున్నాను. నాకు బతుకుదెరువు అవే కదా.. అందుకే అవి తీసి జాగ్రత్తగా ఉంచుకున్నాను." -స్థానికురాలు

kishanreddy Visit Flood Affected Areas in Warangal : మరోవైపు నాలుగు రోజులు దాటినా.. వరదల పంజా విసిరిన భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి తేరుకోలేదు. జల ప్రళయం బారిన పడి ఏ విధంగా ప్రాణాలు కాపాడుకున్నది.. గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. పశువులు చనిపోయి.. జీవనాధారం కోల్పోయామంటూ.. గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించించారు. వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. జిల్లా కలెక్టర్​తో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని.. కేంద్ర బృందాలు నేటి నుంచి పర్యటించి, నష్టం వివరాలను సేకరిస్తారని, మృతులకు కేంద్రం నుంచి 3 లక్షలు.. రాష్ట్రం నుంచి రూ.లక్ష మొత్తం రూ.4 లక్షలు నష్ట పరిహారం అందుతాయని బాధితులకు భరోసాని ఇచ్చారు. రాజకీయం చేయకుండా అందరూ బాధితులకు సహాయంగా నిలవాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.