వరంగల్ నగరంలో సరుకుల పంపిణీ రసాభాసగా మారింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో 14,18వ డివిజన్లో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రాంగణం నుంచి వెళ్లిన వెంటనే జనాలు ఫంక్షన్ హాల్ వద్దకు గుంపులు గుంపులుగా రావటం వల్ల నిర్వాహకులు ఒక్కసారిగా సరుకుల పంపిణీ నిలిపివేశారు.
అనంతరం ఒక్కొక్కరిని లోనికి అనుమతించటం వల్ల సరుకుల పంపిణీ ప్రశాంతంగా జరిగింది. 25 వేల మందికి నిత్యావసర సరుకులను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నేతలు తెలిపారు. దాతల సహకారంతోనే సరుకుల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.