ETV Bharat / state

'కరోనాను నిలువరించడంలో మావంతు సాయం చేస్తాం'

ఉమ్మడి వరంగల్​ జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూనకు మద్దతు తెలిపారు. జనగాం, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, వరంగల్​ గ్రామీణ, వరంగల్​ పట్టణ, మహబూబాబాద్​ జిల్లాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

warangal district people support to janatha curfew
'కరోనాను నిలువరించడంలో మావంతు సాయం చేస్తాం'
author img

By

Published : Mar 23, 2020, 11:45 AM IST

'కరోనాను నిలువరించడంలో మావంతు సాయం చేస్తాం'

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, జనతా కర్ఫ్యూలో శ్రమించిన పోలీసులు, వైరస్​ సోకకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య సిబ్బంది, కరోనా వ్యాప్తిని నిలవరించడానికి నిత్యం ప్రయత్నిస్తోన్న రెవెన్యూ అధికారులు, వైరస్​ సోకిన వారికి ప్రాణాలు లెక్కచేయకుండా వైద్యమందిస్తోన్న వైద్యులకు ఓరుగల్లు ప్రజలు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల సేవకే అంకితమవుతున్న ప్రతి ఒక్కరికి ఉమ్మడి వరంగల్​ జిల్లా ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిని నిలువరించడానికి ప్రభుత్వాలు, అధికారులు చేస్తున్న ప్రయత్నంలో తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.