ETV Bharat / state

కరోనా కట్టడి దిశగా ఓరుగల్లు - no corona in warangal district

కరోనా ఉమ్మడి వరంగల్‌ జిల్లాను తాకింది. కలవర పెట్టింది. భయభ్రాంతులకు గురి చేసింది. ఎవరినీ బయటకు రాకుండా చేసింది. మహమ్మారిని తరిమికొట్టేందకు ఓరుగల్లువాసులు ఏకతాటికిపైకి వచ్చారు. నెలరోజులకుపైగా శాంతియుతంగా యుద్ధం చేస్తున్నారు. కరోనాను కట్టడి చేస్తున్నారు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు.

warangal district is recovering from corona crisis
ఓరుగల్లులో కరోనా అదుపులోకి వస్తుంది!
author img

By

Published : May 9, 2020, 9:39 AM IST

ఓరుగల్లులో మహమ్మారి బారిన పడినవారు కోలుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మినహా మిగతావారు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటికే వరంగల్‌ రూరల్‌, ములుగు, మహబూబాబాద్‌ గ్రీన్‌ జోన్‌లుగా కొనసాగుతున్నాయి. భూపాలపల్లి, జనగామ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చాయి. ఎంజీఎం ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో అనుమానితులెవరూ చేరడం లేదు. ఉమ్మడి వరంగల్‌ కరోనాను జయిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు క్రమంగా సడలిస్తుండడంతో దుకాణాలు తెరుచుకుంటున్నాయి.

కొనసాగుతున్న కార్యకలాపాలు

ప్రభుత్వం పలు మినహాయింపులు ఇస్తుండడంతో జోన్ల వారీగా నిబంధనలు అనుసరించి అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల్లో శుక్రవారం నుంచి సరిబేసి సంఖ్యల విధానంలో దుకాణాలు నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు సినిమా హాళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, బేకరీల్లాంటివి మూసే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

*● వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 27 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటికే 26 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రెండు కంటెయిన్‌మెంటు ప్రాంతాలు ఉన్నాయి.

*● రూరల్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మొదటి నుంచి గ్రీన్‌ జోన్‌గానే కొనసాగుతోంది.

*● జనగామ జిల్లాలో ముగ్గురికి కరోనా సోకగా ఇద్దరు కోలుకొని డిశ్ఛార్జ్‌ అయ్యారు. మరొకరు డిశ్ఛార్జ్‌ అవ్వగానే జిల్లా గ్రీన్‌జోన్‌గా మారే అవకాశం ఉంది.

*● భూపాలపల్లిలో ఒకే ఇంట్లో ముగ్గురు వైరస్‌ బారిన పడ్డారు. ఇద్దరు కోలుకున్నారు. పట్టణంలో కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

*● మహబూబాబాద్‌లో ఒక్క కేసు నమోదవ్వగా అతను కోలుకోవడంతో జిల్లా గ్రీన్‌ జోన్‌గా మారింది.

*● ములుగు జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా వారిద్దరూ కోలుకున్నారు. జిల్లా గ్రీన్‌ జోన్‌గా మారింది.

ఆరోగ్య సర్వే జరుగుతోంది

జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇంటింటి ఆరోగ్య సర్వే కొనసాగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల డేటా తీసుకొని వారికి కొవిడ్‌-19 పరీక్షలు చేయిస్తున్నాం. కేసులు తగ్గినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

- రాజీవ్‌గాంధీ హనుమంతు, కలెక్టర్‌, వరంగల్‌ అర్బన్‌

గ్రీన్‌ మాస్కులు ధరించకుంటే జరిమానా

జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. రెండో కేటగిరిలో కొన్ని దుకాణాలకు సరి, బేసి సంఖ్య ప్రకారం రోజు విడిచి రోజు తెరిచే విధంగా అనుమతి ఇచ్చాం. మాస్కులు ధరించనివారికి రూ. వేయి జరిమానా విధిస్తాం.

- వీపీ గౌతమ్‌, కలెక్టర్‌, మహబూబాబాద్‌

పకడ్బందీగా చర్యలు

కరోనా కట్టడిని పకడ్బందీగా చేపట్టి ఆరెంజ్‌ జోన్‌లో నిలిపాం. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని గుర్తించి 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాం. ~ర ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా చేశాం. సరి, బేసి విధానంలో షాపులు ప్రారంభించాలని చెప్పాం. రద్దీ లేకుండా చూస్తాం.

- నిఖిల, కలెక్టర్‌, జనగామ

సమన్వయంతో పనిచేస్తున్నాం

అందరం సమన్వయంతో పనిచేస్తున్నాం.జిల్లా కేంద్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఈ-ఫ్రెష్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు ఏర్పాటు చేశాం. త్వరలోనే భూపాలపల్లి గ్రీన్‌జోన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

- మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, కలెక్టర్‌, జయశంకర్‌

కొన్ని సడలింపులు ఇవ్వడంతో జన సంచారం పెరిగింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

అప్రమత్తత అవసరం, 14 తనిఖీ కేంద్రాలు

జిల్లా నుంచి ఎవరినీ బయటకు వెళ్లకుండా, ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకున్నాం. జిల్లాలో 14 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇతరులు జిల్లాకు రావాలన్నా పాసులు ఉంటేనే అనుమతి ఇస్తున్నాం. అలాగే వచ్చిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచుతాం.

- కృష్ణ ఆదిత్య, కలెక్టర్‌, ములుగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.