పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వరంగల్ సీపీ తరుణ్ జోషి సూచించారు. గ్రేటర్ కార్పొరేషన్లో పలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. సుబేదారి, కేయూసీ, ఇంతేజార్ గంజ్, మట్వాడా, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేంద్రాలను సందర్శించారు.
పోలింగ్ జరుగుతున్న తీరును సీపీ పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్లు వినియోగించాలని సిబ్బందికి తెలిపారు. సీపీ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, గిరికుమార్, ప్రతాప్ కుమార్ ఉన్నారు.