వరంగల్లో ప్రేమోన్మాది యువతిని హత్య చేసేముందు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడితో మృతురాలికి 2015 నుంచే పరిచయం ఉందని తెలిపారు.
మరో వ్యక్తితో పరిచయం పెంచుకుని.... చాటింగ్ చేస్తోందనే అనుమానంతోనే దారుణంగా గొంతు కోసి హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి... కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పక్కాగా ఆధారాలు సేకరించి... నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీపీ రవీందర్ తెలిపారు.
- ఇదీ చూడండి : 'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది'