వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి నగరంలోని 38వ డివిజన్లోని రామారావుకాలనీ, జవహర్ కాలనీల్లో పర్యటించారు. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్ల పురోగతిని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
మహానగరపాలక సంస్థ పరిధిలో వేయి మరుగుదొడ్ల లక్ష్యాన్ని ఈనెల 25నాటికి పూర్తి చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తేదారులను హెల్డ్‌లో పెడతామని హెచ్చరించారు.